ఈనెల 25న రుణమేళా…. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.రమణారెడ్డి

ఈనెల 25న రుణమేళా…. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.రమణారెడ్డి

ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ మంజీరా గార్డెన్స్ లో ఉదయం 10:00 గంటలకు రుణ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు పాల్గొంటాయని ఆయన తెలిపారు. వివిధ రకాల రుణాలు అందించేందుకు బ్యాంకులు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాలు, గృహ, వాహన, పంట, ఎడ్యుకేషన్, తదితర రుణాలను అందించేందుకు ఆయా బ్యాంకులు అందిస్తున్న రుణాలు, ఏ విధంగా పొందవచ్చన్న వివరాల సమాచారానికి సంబంధించిన స్టాల్స్ పెట్టడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు రుణాలను అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.

ఆయా బ్యాంకులు అందిస్తున్న రుణాలు, వడ్డీ, తిరిగి చెల్లింపులు, రుణం పొందడానికి ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఎన్ని రకాల రుణాలు అందిస్తున్నారు అన్న విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

ప్రజలు , రైతులు,స్వయం సహాయక సంఘాల మహిళలు, వ్యాపారస్తులు, వీధి వ్యాపారులు, కళాశాల విద్యార్థులు, గృహిణులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Post