ఈనెల 27న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహణ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈనెల 27న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహణ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈ నెల 27న స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలో ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపారు.

27న ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డిలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం,ఫల పరిశోధన కేంద్రం( FRS) లో జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు .
ఇట్టి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, వివిధ సంఘాల నాయకులు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.

Share This Post