ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణ…. జిల్లా రెవిన్యూ అధికారి

 

ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణ…. జిల్లా రెవిన్యూ అధికారి

జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులు సమాయత్తం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి సూచించారు.

గురువారం డి ఆర్ ఓ ఛాంబర్లో యువజన, విద్య, సమాచార, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులతో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ పర్యాటక రంగం విశిష్టతను తెలియజేసే విధంగా వేడుకలు జరపాలన్నారు.

విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాల్లో వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలను నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి కి సూచించారు. ఒక్కొక్క విభాగంలో ప్రథమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను విజేతలకు అందించాలన్నారు.

27న ఉదయం 9 గంటలకు సంగారెడ్డి ఐటిఐ నుండి కలెక్టరేట్ వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ,విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని యువజన సంక్షేమ అధికారికి సూచించారు. కళాకారులతో కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసంబంధాల అధికారి కి సూచించారు.
అందరి సమన్వయంతో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు, యువజన సంక్షేమ అధికారి జావిద్ అలీ, డి పి ఆర్ ఓ విజయలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post