ఈనెల 27 నుంచి బీసీ ఓవర్సీస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ-పాస్ వెబ్ సైట్ లో వివరాలు

మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 27 నుంచి జరుగుతుంది. ఈమేరకు వివరాలను ఈ పాస్ తెలంగాణ వెబ్ సైట్ లో పొందుపరిచామని, బీసీ వెల్ఫేర్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021లో నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో పొందు పరిచిన వివరాలు ప్రకారం ఆరో అంతస్తు, సంక్షేమభవన్, మాసాబ్ టాంక్ కార్యాలయంలో  హజరు కావాలని ఆయన సూచించారు. ఈ పథకం కోసం మొత్తం 1089మంది దరఖాస్తు చేసుకున్నారని వారిలో 865మంది బీసీ కులాలకు చెందినవారు కాగా 224మంది ఇబిసి కులాలకు చెందిన అభ్యర్థులున్నారని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీ, సమయం, ఆఫీస్ అడ్రస్ వివరాలు పంపించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి బీసీ యువతకు విదేశాల్లో ఉన్నతవిద్య అవకాశాలు కల్పిస్తూ 2016లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ప్రారంభించిందని,  ఈ పథకం ద్వారా ఏటా రెండు విడతలలో 150 చొప్పున 300 మందికి రూ.20 లక్ష చొప్పున ఆర్థిక సహకారం అందిస్తున్నామని బుర్రా వెంకటేశం గారు  తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Share This Post