ఈనెల 29 న కామారెడ్డి కి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శుక్రవారం బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను ఆయా శాఖ అధిపతులు కార్యాలయాల్లో నోటీసు బోర్డు పై ప్రచురించాలని సూచించారు. ఈనెల 28న జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు. —————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post