ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ వారోత్సవ కార్యక్రమాలలో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు  నిర్వహించే స్వచ్ఛ వారోత్సవ కార్యక్రమాలలో ప్రజలు,  ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు,  గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.
తొలుత ఆరవ తేదీన గ్రామసభ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సమభావన సంఘాల మహిళలతో ఇంటింటికి వెళ్లి తడి, చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించాలని,  పూర్తి కాని వైకుంఠ ధామాల పనులు పర్యవేక్షించి పూర్తి చేయాలని,  వాటిని వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. నర్సరీ  అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలలో కలుపు మొక్కలు లేకుండా చూడాలని,  చనిపోయిన మొక్కల స్థానంలో  కొత్త మొక్కలు నాటాలని తెలిపారు.  చెత్త ఎక్కువ వేసే హాట్ స్పాట్ల ను గుర్తించాలని,  మెయిన్ రోడ్ లు, ఇంటర్నల్ రోడ్డులు,  ఫంక్షన్ హాల్స్ వద్ద చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని,  హాట్ స్పాట్ల వద్ద చెత్త వేసే డబ్బాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  గ్రామాలలో స్వచ్ఛతా జాగృతి ర్యాలీలు ఏర్పాటు చేయాలని,  ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ కమిటీలత శ్రమదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని,  గ్రామ పంచాయతీ శానిటేషన్ పై యాక్షన్ ప్లాన్ రూపొందించి వాటిని పక్కాగా నిర్వహించాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో కంపోస్టు ఎరువుల తయారీకి చర్యలు తీసుకోవాలని,  తయారైన ఎరువు క్లాత్ బ్యాగ్ లలో నింపాలని తెలిపారు.  అన్ని గ్రామ పంచాయితీలలో స్వచ్ఛభారత్ మిషన్  పెయింటింగ్స్  వేయించాలని,  ముఖ్యంగా గ్రామపంచాయతీ కార్యాలయాలలో  పెయింటింగ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  గ్రామాలలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సభను నిర్వహించి సమస్యలపై చర్చించాలని తెలిపారు.  బయోమెడికల్ వేస్ట్ ను సరైన పద్ధతి ద్వారా డిస్పోజ్  చేసేందుకు  అవగాహన కల్పించాలని,  ఇంకుడు గుంతల నిర్మాణానికి అవగాహన కల్పించాలని తెలిపారు.  ఇంటినుండే కిరణా షాపులకు, మార్కెట్లకు వెళ్లేముందు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులు వినియోగించేలా,  హోటల్స్, షాప్స్,  మాల్స్ ముందు చెత్త వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని తెలిసేలా దండోరా వేయించాలని  తెలిపారు.  ప్రజలకు ప్లాస్టిక్ వస్తువుల పట్ల ఉన్న నిషేధంపై వివరిస్తూ అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వాడకంపై వివరించాలని,  ఒక షాపుకు ఒక చెత్త డబ్బా తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  బాల సంసద్ కార్యక్రమంలో భాగంగా బడి పిల్లలతో గ్రామ పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని‌,  పాఠశాలలు, కళాశాలలు అన్ని విద్యా సంస్థలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించాలని తెలిపారు.
పారిశుద్ధ్యంపై క్విజ్, వ్యాసరచన,  రంగోలి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు శుభ్రత,  పారిశుద్ధ్యంపై వివరించాలని, తద్వారా తల్లీబిడ్డల  ఆరోగ్యం, ఎదుగుదల పై వివరించాలని తెలిపారు.  ప్రతి గ్రామపంచాయతీలో చేపట్టిన కార్యక్రమాలపై ముందు, ఆ  తర్వాత ఫోటో డాక్యుమెంటేషన్ చేయాలని ఆదేశించారు.  శానిటేషన్ సిబ్బంది కి సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
గ్రామాల్లో చేపట్టిన రోజువారీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Share This Post