ఈనెల 8 నుండి గ్రామ స్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై అవగాహన, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం …….జిల్లా కలెక్టర్ హనుమంతరావు
10 మండలాలోని 37 గ్రామ పంచాయతీలు,37 హ్యాబి టేషన్ లలో అటవీ భూముల ఆక్రమణ గుర్తింపు
ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటి ఏర్పాటు
అడవుల పునరుజ్జీవన దిశగా పటిష్టమైన చర్యలు
ఆర్వోఎఫ్ఆర్ పట్టా దరఖాస్తుల పై అవగాహన కల్పించి, పోడు భూముల దరఖాస్తులను ఈనెల 8 నుండి స్వీకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పోడు మరియు అటవీ సంరక్షణ, పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ అంశం పై శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మండల మరియు గ్రామ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వం పోడు భూముల సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఈనెల 8 నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా ఇవ్వడం మరియు అటవీ భూముల ను సంరక్షించడం ప్రధాన ద్యేయమని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పది మండలాల్లోని 37 గ్రామపంచాయతీలు, 37 హ్యాబిటేషన్ లలో 2958 ఎకరాల అటవీ భూమిలో 1501 మంది ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు.
ప్రతి గ్రామంలో సర్పంచ్, విఆర్ఎ, అటవీ బీట్ అధికారి, పంచాయతి కార్యదర్శీ బృందంగా ఏర్పడి పోడు భూమి సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 31 డిసెంబర్ 2005 కంటే ముందు నుంచి సాగు చేసుకునే వారికి హక్కులు సంక్రమిస్తాయని తెలిపారు. జనవరి 1, 2006 నుండి ఆక్రమణలో ఉన్నట్లయితే అర్హులు కారని స్పష్టం చేశారు.
నవంబర్ 8న ఆర్వోఎఫ్ఆర్ చట్టం, పోడు సాగు పట్టా దరఖాస్తు విధానం, జత చేయాల్సిన పత్రాలు తదితర అంశాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ లో ఆయా అధికారులు అలక్ష్యం చేయరాదన్నారు. జిల్లా ,మండల, గ్రామ స్థాయి కమిటీల తో పాటు అటవీ హక్కుల కమిటీ ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తులను జాగ్రత్తగా వినియోగించాలని, జవాబు జవాబుదారితనంగా ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, దరఖాస్తులను ఇచ్చి సరిగ్గా పూరించి స్వీకరించాలన్నారు. అధికారులు అర్హతలు, అనర్హతలు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, స్పష్టతతో ప్రణాళికగా పని చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, డి పి ఓ సురేష్ మోహన్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాస రావు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, డి ఎల్ పి వో లు, ఎంపీడీవోలు ,ఏపీ డి లు, తహసీల్దార్లు ,డిప్యూటీ తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, ఎంపీవోలు, సర్వేయర్లు, ఏ పీ ఎం లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు