ఈరోజు ‘స్నేహిత ‘బాలల సంరక్షణ అవగాహన సదస్సు సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాల బోనగిరిలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన కలుగు నష్టాల గురించి, ఫోక్సో చట్టం, బాల్య వివాహచట్టము గురుంచి అవగాహన కల్పించారు.బాల్యవివాహాల సమాచారము112 నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పై అన్ని అంశములపై అవగాహన కల్పించారు .

విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఉద్భోదించారు.
ఈ కార్యక్రమమునకు సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ యాదాద్రి రీజన్ ,ఆర్ సి ఓ ,ఎన్ రజిని గారు , డీసీపీఓ సైదులు గారు, సెక్టోరియల్ ఆఫీసర్ ఆండాలు గారు, జడ్.పి.హెచ్.ఎస్ .బీచ్ మహల్ హెడ్మాస్టర్ భాస్కర్ గారు, బెల్లంపల్లి,పి హెచ్ సి. అనిల్ కుమార్ గారు. ప్రిన్సిపాల్ శ్రీరామ్ శ్రీనివాస గారు విద్యార్థులకు ‘ స్నేహిత’కార్యక్రమము పై అవగాహన కల్పించారు.

Share This Post