ఈరోజు 13-11-2021 నాడు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైద్రాబాద్ వారి అద్వర్యంలో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ మరియు సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ, హైద్రాబాద్ వారు సమనవ్యయంతో పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ మరియు ఔట్రీచ్ కాంపెయిన్, ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు శ్రీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియం లో న్యాయ సేవల శిభిరము పేదరిక నిర్ములన పథకం (మొడ్యూల్ కాంప్) నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ హై కోర్టు జస్టిస్ శ్రీమతి సుమలత గారు ముఖ్య అతిధితి గా హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో శ్రీమతి సుమలత గారు మాట్లాడుతూ, వివేకానంద స్వామి గారి గురించి వారు చేసిన గొప్ప పనుల గురించి, వారి వల్ల మన దేశానికీ వచ్చిన గొప్ప పెరు గురించి వివరించారు, అలాగే న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం చేరువలో ఉండాలని, ఇప్పటికే చాలా మంది న్యాయ సేవాధికార సంస్థ యొక్క సేవలను వింజయోగించుకున్నారని, ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంచటమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం అని తెలియజేసారు, అలాగే వారు ఏకలవ్య కథ గురించి వివరిస్తూ, వేలు పొగుట్టుకున్నా విద్య మీద ఆయనకున్న శ్రద్ధ వల్ల ఆయన పేరు ఎలా చిరస్తాయిలో నిలిచిందో, అలాగే ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధి కోసం తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మరియు ఇంచార్జి చైర్మన్ శ్రీ సురేష్ గారు, సిటీ సివిల్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మరియు ఇంచార్జి చైర్మన్ శ్రీ ప్రభాకర్ రావు గారు, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరి వేణుగోపాల్ గారు, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగం నారాయణ గారు, హైద్రాబాద్ సిటీ పోలీసు కమిషనర్ శ్రీ అంజనీ కుమార్,అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అధితులుగా హాజరు కాటం జరిగింది, అలాగే ఇరు కోర్టుల నుంచి జ్యూడిషల్ అధికారులు కూడా పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ గారు మరియు సిటీ సివిల్ కోర్టు నయ్య సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ మురళి మోహన్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దేపార్టుమెంటు వారు వారి వారి శాఖలకు సంబందించిన స్కీములను, వారి శాఖల వల్ల ప్రజలకు ఉన్న ప్రయోజనాల గురించి స్టాళ్లు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే లబ్దిదారులకు ఈ కార్యక్రమంలో వారికి చెందవలసిన రుసుమును మరియు ప్రయోజనాలను ముఖ్య అతిధుల ద్వారా వారికి అందజేయడం జరిగింది.
వివిధ డిపార్ట్మెంట్లు,వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా కృత్రిమ అవయవాలు, సాంఘిక సంక్షేమ శాఖద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న వారికీ సర్టిఫికెట్ మరియు 2 .50 లక్షల క్యాష్ అందించడం జరిగింది.

????????????????????????????????????

Share This Post