ఈవిఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ఈవిఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 9: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లలో భద్రపరచబడిన ఈవిఎంల భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య గురువారం నాడు పరిశీలించారు. భద్రతా సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్ల చుట్టూ పిచ్చి మొక్కలు పొదలు తొలగించి శుభ్రం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, ఎస్డీసి ఎస్. మాలతి, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏతేషామ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post