*ఈవిఎం గోదాంలలో వర్షపు నీటి సంరక్షణ కు తగిన చర్యలు – జిల్లా కలెక్టర్ కె.శశాంక*

ప్రచురణార్థం

*ఈవిఎం గోదాంలలో వర్షపు నీటి సంరక్షణ కు తగిన చర్యలు – జిల్లా కలెక్టర్ కె.శశాంక*

మహబూబాబాద్, జూన్ -03:

జిల్లాలో ఈవిఎం గోదాములలో వర్షపునీటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శశాంక్ నేడోక ప్రకటనలో తెలిపారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ ఆదేశానుసారం జిల్లాలో నిర్మించిన ఈవిఎం గోదాంలలో వర్షపునీరు వృధా కాకుండా వాటిని నిల్వ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి శాఖ అధికారినీ కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్ లోని ఈవీఎం గోదాంఆవరణలో మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్,తహశీల్దార్లకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న మేజర్ పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని జూన్ 5న మొక్కలు నాటే విధంగా ఈఆర్ఓ లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మండల రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బూత్ లెవల్ అధికారులకు ఒక ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి నూతనంగా ఓటరు జాబితా లో మార్పులకు దరఖాస్తు చేసుకునేవారు మ్యానువల్ ఫారములకు బదులుగా ఆన్లైన్ లో ఫారములు ద్వారా నమోదు చేసుకునే విధంగా గరుడ యాప్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

కొత్తగా నమోదు చేసికున్న ఓటర్లకు e-Epic కార్డు nvsp లేదా ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ కె. శశాంక ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post