ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణాలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో స్ట్రాంగ్రూమ్లు ప్రారంభం ఈవీఎం గోదాంలను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

ఈవీఎంలు, వీవీ ప్యాట్​ల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణాలు

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలో స్ట్రాంగ్​రూమ్​లు ప్రారంభం

ఈవీఎం గోదాంలను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​ గోయల్​

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అవసరమైన ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్​ల భద్రత కోసం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని  జిల్లాల్లో ప్రత్యేక గోదాము(స్ట్రాంగ్​ రూమ్)లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​ గోయల్​ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్​పేట మండలంలోని అంతాయపల్లిలో నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1.95 కోట్లతో 7,700 స్వ్కేర్​ ఫీట్లతో… 3,140 ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఉంచేలా నిర్మించిన ఈవీఎమ్​లు, వీవీ ప్యాట్​ల గోదాములను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​ గోయల్​ జిల్లా కలెక్టర్ హరీశ్​,  అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​ గోయల్​ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఎన్నికల సమయాల్లో ఎన్నికల కోడ్​ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈవీఎమ్​లు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక దృష్టిసారించి నిధులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని హంగులతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల కోసం ప్రత్యేకంగా గోదాములు (స్ట్రాంగ్​రూమ్​లు) నిర్మించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా భవనంతో పాటు రోడ్డు, కాంపౌండ్​వాల్​ను డాక్టర్​ శశాంక్​ గోయల్​ పరిశీలించారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన స్ట్రాంగ్​ రూమ్​ గోదాములలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా ఈవీఎమ్​లను భద్రపర్చడానికి అనువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ హరీశ్​ మాట్లాడుతూ… జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఈవీఎమ్​లు, వీవీ ప్యాట్లను భద్రపర్చేందుకు ప్రత్యేకంగా స్ట్రాంగ్​రూమ్​లను నిర్మించినందున మున్ముందు వీటిని వేర్వేరు చోట్ల నుంచి తీసుకురావాల్సిన ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం జిల్లాలో వీటిని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్​ అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ఈవీఎమ్​లు, వీవీ ప్యాట్లను జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని స్ట్రాంగ్​రూమ్​ల నుంచే తీసుకువెళ్ళడం, తిరిగి అక్కడే భద్రపర్చడం వల్ల సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు ప్రత్యేక భద్రత కల్పించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. గతంలో ఎన్నికల సమయానికి ముందు ప్రభుత్వ, ప్రైవేట్​ విద్యా సంస్థల్లో వీటిని భద్రపర్చడం ఎన్నికల సమయానికి డిస్ట్రిబ్యూషన్​, రిసీవింగ్​ సెంటర్​కు తీసుకురావడానికి ఇబ్బందులు ఉండేవని ప్రస్తుతం నిర్మించిన గోదాముల వల్ల ఒకే దగ్గర నుంచి తీసుకువచ్చి తిరిగి అక్కడే స్ట్రాంగ్​రూమ్​లలో భద్రపర్చడం జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎం గోదాము (స్ట్రాంగ్​రూమ్) ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, ఆర్అండ్ బి అధికారిశ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో రవి, మండల తహశీల్దార్​ తదితరులు పాల్గొన్నారు.

Share This Post