ఈవీఎంల పరిశీలన – జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

స్థానిక నాలుగవ పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ దేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలో భద్రపరచి ఉన్న గదుల సీల్ ఓపెన్ చేసి ఈవీఎంలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంబడి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపర్డెంట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post