ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాలుగో పోలీస్ స్టేషన్ పక్కన గల
ఈవీఎం గోదాంను పరిశీలించారు.

సోమవారం ఈవీఎం గోదాము మరమ్మత్తుల గురించి కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గోదాం పై కప్పు పనులు లీకేజీలు లేకుండా నిర్వహించాలని, గోదాంలో ముఖ్యమైన మెటీరియల్ ఉన్నందున మరమ్మతు పనులకు వచ్చే లేబర్ కు ఐడీ కార్డులు ఇవ్వాలని, రిజిస్టర్ మెయింటెన్ చేయాలని వారి ఫోన్ నెంబర్లు తీసుకోవాలని ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. అధికారులు క్లోజ్ మానిటర్ చేయాలన్నారు. చుట్టుపక్కల పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డి ఈ శంకర్, ఎలక్షన్ సెక్షన్ సూపర్డెంట్ వినోద్ సంబంధిత అధికారులు ఉన్నారు.

Share This Post