ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

 

మహబూబాబాద్, జూలై -22:

ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి త్రై మాసం తనిఖీలో భాగంగా కురవి రోడ్డులో క్రొత్త కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో గల ఈ వీ ఎo గోదాము ను సందర్శించి పరిశీలించారు.

స్ట్రాంగ్ రూమ్ సీల్ ను పరిశిలించిన అనంతరం, సీల్ ను తీసి గోదాము తెరిచి లోపల భద్రపరిచిన ఈ.వి.ఎం.లను పరిశీలించారు. గోదాము ముందు ఆవరణలో రోడ్డు వేయాలని ఆర్ అండ్ బి – ఈ. ఈ. ని ఆదేశించారు. సి సి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలనీ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో బి.జే.పి. పార్టీ ప్రతినిధులు మల్లం యశ్వంత్, టి.ఆర్.ఎస్. నుండి దాసరి రావిష్, ఆర్ అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, తహసిల్దార్ నాగ భవాని, ఎలక్షన్ సూపరింటెండెంట్ అనురాధ భాయి, డిప్యూటీ తహశీల్దార్ శ్యామ్, సీనియర్ అసిస్టెంట్ బషీర్, టెక్నికల్ ఆపరేటర్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post