ఈవీఎం గోదాముల ను పరిశీలించిన కలెక్టర్…

ప్రచురణార్థం

ఈవీఎం గోదాముల ను పరిశీలించిన కలెక్టర్…

మహబూబాబాద్, సెప్టెంబర్ 28.

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పాత ఈవీఎం గోడౌన్ తో పాటు కురవి రోడ్ లో కొత్త కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్న నూతన ఈవీఎం గోదాము లను జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఈ వి ఎం గోదాం పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు.

నూతన ఈవీఎం గోదాం ఆవరణలో మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ వెంట ఆర్అండ్బి అధికారులు ఈ ఈ తానేశ్వర్ డి ఈ రాజేందర్ కలెక్టర్ కార్యాలయ ఎన్నికల విభాగం అధికారులు బషీర్ రంజిత్ తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది నరేష్ తదితరులు పాల్గొన్నారు.
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post