ఈవీఎం గోదాము ను తనిఖీ చేసిన కలెక్టర్…

ప్రచురణార్థం

ఈవీఎం గోదాము ను తనిఖీ చేసిన కలెక్టర్…

మహబూబాబాద్ నవంబర్ 29.

ఈవీఎం గోదాము పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశించారు.

సోమవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదామును కలెక్టర్ ఎన్నికల విభాగం సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు.

సీసీ కెమెరా గదిలోకి వెళ్లి కెమెరా పనితీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

సెక్యూరిటీ గార్డ్ విధులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించరాదన్నారు. అనంతరం రిజిస్టర్ లో సంతకం చేశారు.

కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం తాసిల్దార్ రమేష్, ఈ డి ఎం రంజిత్, ఎన్నికల విభాగం సిబ్బంది రంజిత్ లు ఉన్నారు
——————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post