ఈవీఎం గోదాము ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసిన కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఈవీఎం గోదాము పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ ఆదేశించారు.
గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదామును కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు.
సీసీ కెమెరా గదిలోకి వెళ్లి కెమెరా పనితీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
సెక్యూరిటీ గార్డ్ విధులను అడిగి తెలుసుకున్నారు.
ముందస్తు అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించరాదన్నారు. అనంతరం రిజిస్టర్ లో సంతకం చేశారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిర్వహిస్తున్న అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్థం రవి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి హుస్సేన్ నాగర్ కర్నూల్ డిప్యూటీ తహసిల్దార్ ఖాజా, ఎన్నికల విభాగం సిబ్బంది అశోక్ తదితరులు ఉన్నారు.

Share This Post