ఈ ఆఫీస్ అమలు పర్చేందుకు ఫైలింగ్ విధానంపై సందేహాలను నివృత్తి చేసుకొని ఇక నుండి ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 16,ఖమ్మం:

ఈ ఆఫీస్ అమలు పర్చేందుకు ఫైలింగ్ విధానంపై సందేహాలను నివృత్తి చేసుకొని ఇక నుండి ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజా సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన ఈ-ఆఫీస్ ఫైలింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు చేసారు. ఈ-ఫైలింగ్ విధానం పట్ల ఇప్పటికే శిక్షణ పొందిన అధికారులు, సిబ్బంది మిగతా సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించి ఇక నుండి ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయపు ఉత్తర ప్రత్యుత్తరాలు, రికార్డుల నిర్వహణ జరగాలని కలెక్టర్ సూచించారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పనులపై ఈ-ఫైలింగ్ విధానం ద్వారా ఫైలింగ్ చేయాల్సిందిగా కార్యాలయపు పర్యవేక్షకులకు ఆదేశించి స్వయంగా కలెక్టర్ ఈ-ఫైలింగ్ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా పలు మండలాల్లోని పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థల సేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఇంకనూ బృహత్ పల్లె ప్రకృతి వనాలకు ప్రభుత్వ స్థలాలు గుర్తించని. ప్రదేశాలలో సత్వరమే స్థలాలను గుర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు చేయాలని ఇట్టి పనుల్లో జాప్యానికి కారకులైన బాధ్యులపై చర్యలుంటాయని కలెక్టర్ తెలిపారు.

ఏ.పి.డి శిరీష, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post