ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్

ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసిసి/డి.ఎల్ఆర్.సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సన్న చిన్న కారు రైతులు పంట రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని ఆదేశించారు. రైతులు రుణాలు తీసుకునే విధంగా వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు అవగాహన కల్పించాలని సూచించారు. వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు
సూచించారు. బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు.
పంట రుణాల పంపిణీ , వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ రుణాల వంటివాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు వార్షిక కార్యచరణ 2020-21 బుక్ ను కలెక్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్,ఆర్బీఐ అధికారి రాధాకృష్ణ, నాబార్డు ఎంజిఎం ప్రవీణ్ కుమార్ జిల్లా అధికారులు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post