ఈ నెలాఖరులోగా కేజీ టు పీజీ ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఈ నెలాఖరులోగా కేజీ టు పీజీ ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-
సిరిసిల్ల 19, జూలై 2022
——————————-
రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవతో నిర్మిస్తున్న కేజీ టు పీజీ ప్రాజెక్ట్ ను జులై నెలాఖరులోగా అన్ని హంగులతో ప్రారంభానికి సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ గంభిరావు పేట మండల కేంద్రము లో కేజీ టు పీజీ ప్రాజెక్ట్ ను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తో కలిసి పరిశీలించారు.

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం మన ఊరు మన బడి లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి ఫండ్ తో ప్రభుత్వం కేజీ టు పీజీ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తుందన్నారు.

గంభిరావు పేట మండలం తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్ట్ వరం లాంటిదని జిల్లా కలెక్టర్ అన్నారు. విద్యా, క్రీడా నిలయంగా ఉంటుందన్నారు.

అంగన్వాడీ, ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఈ ప్రాజెక్ట్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటితో పాటు భవిత సెంటర్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ల్యాబ్, డైనింగ్ హాల్, కిచెన్ వంటి అధునాతన సౌకర్యాలు ప్రాజెక్ట్ లో ఉంటాయన్నారు.

Share This Post