ఈ నెల చివరిలోగా ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ నిర్మాణం పూర్తిచేయాలని ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 18 (శనివారం).

ఈ నెల చివరిలోగా ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ నిర్మాణం పూర్తిచేయాలని ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఎలక్షన్ సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ నిర్మాణం, ఓటర్ జాబితా తయారు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ నిర్మాణాలు చివరి స్థాయిలో ఉన్నాయని విద్యుత్తు తదితర అన్ని వసతులతో ఈ నెల చివరిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని 18 సంవత్సరాలు నిండిన పౌరుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి నమూనా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీ నాడు ప్రచురించాలని ఆ జాబితాలో అభ్యంతరాలపై నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించి స్వీకరించిన అభ్యంతరాల దరఖాస్తులను డిసెంబర్ 27 వరకు పరిష్కరించి 5 జనవరి 2022 నాడు చివరి ఓటరు జాబితాను ప్రసరించేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికలఅధికారి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిందని నెలాఖరు లోగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే ఎన్నికల రిటర్నింగ్ స్థాయి అధికారి నుండి బూత్ లెవెల్ అధికారుల వరకు అందరినీ ఓటరు జాబితా తయారీలో భాగస్వాములను చేసి బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఇంటింటి ఓటరు నమోదు సర్వే నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టి నిర్ణీత సమయానికి చివరి ఓటరు ఓటర్ జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, ఎలక్షన్ డిటి కుంబాల రవికుమార్, టెక్నికల్ ఆఫీసర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post