ఈ నెల చివరిలోగా ప్రతి ఇంటిని సందర్శించి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వైద్య అధికారులకు సూచించారు.

మంగళవారం నాడు బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండరాదని,  ఇంటింటి సర్వే ద్వారా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని  తెలిపారు.  ఫార్మసీ, ల్యాబ్,  డెలివరీ వార్డులను తనిఖీ చేశారు.  గర్భిణీ స్త్రీలను పలకరించి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.  బలమైన ఆహారం తీసుకోవాలని, అందరూ తప్పనిసరిగా వాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
అనంతరం భువనగిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.  ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహించాలని,  వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని,  పేషెంట్లకు మంచిగా వైద్యసేవలు అందించాలని సూచించారు.
డాక్టర్ పరిపూర్ణ చారి,  డాక్టర్ వివేకానంద, వైద్య సిబ్బంది కార్యక్రమంలో ఉన్నారు.
ఈ నెల చివరిలోగా ప్రతి ఇంటిని సందర్శించి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వైద్య అధికారులకు సూచించారు.

Share This Post