ఈ నెల డిసెంబర్ 31 తేదీలోగా వాక్సినేషన్ పూర్తి చేయాలి:: జిలా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణర్దం-3
జనగామ, డిసెంబర్ 6: ఈ నెల డిసెంబర్ 31 తేదీలోగా వాక్సినేషన్ పూర్తి చేయాలని జిలా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వాక్సినేషన్ పై వైద్యాధికారులు, జిల్లా అధికారులు, మండల, వార్డు ప్రత్యేకాధికారులు, సబంధిత సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ 31 వరకు మొదటి, రెండవ డోసు వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా వాక్సిన్ తీసుకోవాల్సిన వారి జాభితా ప్రకారం వాక్సిన్ వేసేందుకు వీలుగా ప్రత్యేక మొబిలైజేషన్ చేయాలని చెప్పారు. ప్రతి హాబిటేషణ్, వార్డు వారిగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. వాక్సిన్ తీసుకోవడం వల్ల సురక్షితమని, ఆశా వర్కర్లు, ఏఎన్ఏo లు వైద్య సిబ్బంది ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వాక్సినేషన్ తీసుకునేవారు డ్యూ లిస్టు డేట్ ప్రకారంగా స్వయంగా ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి వాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యాధికారి డా. ఏ. మహేందర్, జెడ్పిసిఈఓ ఎల్. విజయ లక్ష్మి, మండల ప్రత్యేక అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post