ఈ నెల 1 నుండి 30 వరకు “పోషణ్ అభియాన్” కార్యక్రమాలపై అవగాహన : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన నల్గొండ
14. 9. 2021
____________
ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న “పోషణ్ అభియాన్” కార్యక్రమం కింద జిల్లాలోని మహిళలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమా  వేశ మందిరంలో పోషన్ అభియాన్ పోస్టర్ ను, టేబుల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
గ్రామస్థాయిలో నిర్వహించే గ్రామ సమాఖ్య సమావేశాలలో పోషన్ అభియాన్ అంశాన్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని చర్చించాలని, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కూడా పోషణ అభియాన్ ను నిర్వహించాలని అన్నా.రు పట్టణాలతోపాటు, గ్రామాలలో పోషన్ అభియాన్ కార్యక్రమం ఎలా జరుగుతుందో అధికారులు పర్య వేక్షించాలని అన్నారు
పోషన్ అభియాన్ కింద పరిశుభ్ర తాగునీరు , పౌష్టికాహారం ,ఆ వారంలో చేయవలసిన పనులు, పోషణ్ అభియాన్ కింద చేపట్టే అవగాహన కార్యక్రమాలపై పట్టణాలు మొదలుకొని గ్రామ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
డి.ఆర్.డి.ఓ.కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, మహిళా శిశు సంక్షేమ అధికారి ని సుభద్ర, సి.పి.ఓ.బాల శౌరి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
____________

జారీ చేసినారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ ,నల్గొండ.

 

 

Share This Post