ఈ నెల 11వ. తేదీలోగా ఆయా రీచ్లలోని ఇసుక కొత్త ట్రాక్టర్ ల నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన      తేది:8.10.2021, వనపర్తి.

వనపర్తి జిల్లాలో ఇసుక సరఫరా చేయుటకు కమలుద్దిన్పుర్, ఘనపూర్, వీర రఘవాపుర్, ఆత్మకూర్, తూముకుంట, వీపనగండ్ల ప్రాంతాల రీచ్లలో ని ఇసుక వాహనము నందు కొత్త ట్రాక్టర్ ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు.
ఇసుక వాహనము (MIV) ద్వారా రవాణా చేసేందుకు ఆసక్తిగల కమర్షియల్ ట్రాక్టర్ యజమానులు అందరూ సాండ్ మేనేజ్ మెంట్ సొసైటీ, వనపర్తి, పేరున ఏదైనా నేషనల్ బ్యాంకులో రూ. 30,000/- డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు నమూనా దరఖాస్తు ఫారంను నింపి, సంబంధిత తహసీల్దార్లకు అక్టోబర్ 11వ తేది లోగా అందజేయాలని ఆమె సూచించారు.
ఇసుక నిర్వహణ సంఘం, వనపర్తి జిల్లా ఆమోదం పొందిన డిజైన్ల ప్రకారం యజమానులు అందరు వారి ట్రాక్టర్ లకు పెంటింగ్ వేయించవలేనని ఆమె వివరించారు. ఇసుక నిర్వహణ సంఘం, వనపర్తి జిల్లాచే ఆమోదించబడిన నియమ, నిబంధనలను అతిక్రమించరాదని, సదరు నియమ, నిబంధనలను పాటించనిచో (MIV) నందు ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు, సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడునని ఆమె వివరించారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయబడినది.

గమనిక:1) నమోదు దరఖాస్తులు సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి.
2) కమర్షియల్ ట్రాక్టర్లు మాత్రమే నమోదు చేసుకొనుటకు అర్హులు.

Share This Post