పత్రికా ప్రకటన తేది:10.08.2022, వనపర్తి.
75 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మున్సిపల్ కమిషనర్. ప్రొహిబిషన్, ఎక్సైజ్, ఎంపీడీవోల ఆధ్వర్యంలో “ఫ్రీడం రన్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 11 వ తేదీన ఉదయం గం.6.30 ని.లకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎకో పార్క్ వరకు ఫ్రీడం రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, యువతి యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “ఫ్రీడం రన్” కార్యక్రమాని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.