ఈ నెల 13న నాలుగు సెంటర్ ల నుండి ర్యాలీగా బయలుదేరి తొర్రూరు బస్ స్టాండ్ ప్రాంతానికి రావాలి …. మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -12:

ఈ నెల 13 న ప్రజా ప్రతినిధులు, వార్డ్ కౌన్సిలర్ లు తమ వార్డులో గల విద్యార్థులు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., ఉద్యోగస్తులు, ప్రజలతో కలిసి అత్యధిక సంఖ్యలో సూచించిన నాలుగు సెంటర్ ల నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీగా జాతీయ జెండాలు, ప్ల కార్డులతో బయలుదేరి తొర్రూరు బస్ స్టాండ్ ప్రాంతానికి 11 గంటల లోగా రావాలని మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి నేడోక ప్రకటనలో తెలిపారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 13న నిర్వహించు ర్యాలీలో పట్టణంలోని 36 వార్డులకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరు సమీపంలోని సూచించిన సెంటర్ ల నుండి కలిసికట్టుగా ర్యాలీగా తొర్రూరు బస్టాండ్ ప్రాంతానికి రావాలని తెలిపారు.

వార్డు నెంబరు 1, 11, 12, 13, 27, 32 కు చెందిన వారు ఎఫ్ ఆర్ ఓ కు చేరుకొని 10 గంటలకు సెంటర్ నుండి బయలుదేరి 11 గంటల లోగా తొర్రూరు బస్ స్టాండ్ ప్రాంతానికి రావాలని తెలిపారు.

అలాగే వార్డు నెంబరు 2, 3, 4, 5, 14, 15, 16, 17, 18, 28, 29, 30, 31కు చెందిన వారు ముకుంద టాకీస్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి రావాలని తెలిపారు.

మూడు కొట్ల సెంటర్ నుండి 9, 10, 21, 22, 23, 24, 25, 26, 36 వార్డ్ ప్రజలు ర్యాలీగా రావాలని, పత్తిపాక సెంటర్ నుండి 6, 7, 8, 19, 20, 33, 34, 35 వార్డు ప్రజలు ర్యాలీగా తొర్రూరు బస్ స్టాండ్ ప్రాంతానికి 11 గంటల లోగా రావాలని తెలిపారు.

నాలుగు సెంటర్ ల నుండి తొర్రూరు బస్ స్టాండ్ కు ర్యాలీగా వచ్చిన తర్వాత ఉదయం 11 గంటలకు మూడు రంగుల బెలూన్ లను విడుదల చేయనున్నట్లు ప్రసన్న రాణి ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post