ఈ నెల 14 వ తేదీన జరిగే జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో జరిగే బాలల దినోత్సవ వేడుకలకు జోగులాంబ గద్వాల జిల్లా బాల సదనం నుండి 30 మంది చిన్నారులను పంపిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

 పత్రికా ప్రకటన                                                                                          తేది:11-11-2021

ఈ నెల 14 వ తేదీన జరిగే జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో జరిగే బాలల దినోత్సవ వేడుకలకు జోగులాంబ గద్వాల జిల్లా  బాల సదనం నుండి 30 మంది చిన్నారులను పంపిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

గురువారం కల్లెక్టరేట్ ఆవరణ లో మహిళా శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో  జిల్లా బాల సదనం నుండి 30 మంది చిన్నారులను హైదరాబాద్ కు తీసుకెళ్ళే ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులు ఈరోజు నుండి  14 తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే వేడుకల్లో పాల్గొంటారని, అదేవిధంగా పిల్లలకు హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలను చూపించడం జరుగుతుందని అన్నారు. జిల్లా బాల సదనం నుండి వెళ్ళిన  పిల్లల యొక్క నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి  శ్రీమతి ముషాహీదా  బేగం, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ నరసింహ , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయనైనది.

Share This Post