ఈ నెల 16న నిర్వహించు కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు ఈ నెల 14 లోగా పేర్లను నమోదు చేసుకోవాలి :: అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్ట్ 12:

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 16న నిర్వహించు కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు ఈ నెల 14 వ తేదీ సా. 5.00 గంటలలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా జిల్లాలోని కవులతో ఈ నెల 16న స్ధానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 గంటల నుండి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇట్టి కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు దేశపు ఘనకీర్తిని, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రస్పుటిoచేలా, స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని, చరిత్రను వివరించేలా తమ కవితలను వినిపించాల్సి ఉంటుందని, జిల్లాకు చెందిన కవులు, కవయిత్రులు తమ తమ కవితల ప్రతిని నిర్వాహకులకు ముందస్తుగా అందించాలని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన కవులు, కవయిత్రులు తమ పేర్లను జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయం సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

 

Share This Post