*ఈ నెల 16న నిర్వహించు కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు ఈ నెల 14 లోగా పేర్లను నమోదు చేసుకోవాలి….. జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్.*

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -12:

ఈ నెల 16న నిర్వహించు కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు ఈ నెల 14 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్ నేడోక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాల మేరకు జిల్లాలోని కవులతో ఈ నెల 16న స్ధానిక IMA హాల్ లో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.

ఈ కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రులు దేశపు ఘనకీర్తినీ, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రస్పుటిoచేలా, స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని, చరిత్రను వివరించేలా తమ కవితలను వినిపించాల్సి ఉంటుందని, జిల్లాకు చెందిన కవులు, కవయిత్రులు తమ కవితలను ఈ నెల 14 వ తేదీన ముందస్తుగా వినిపించి, తమ కవితల ప్రతిని నిర్వాహకులకు అందించాలని, ఎంపికైన కవితలను 16వ తేదీన అతిధుల సమక్షంలో IMA హాల్ లో జరిగే కవిసమ్మెళనం లో వినిపించవలసి ఉంటుందనీ తెలిపారు.

ఆసక్తి కలిగిన కవులు, కవయిత్రులు తమ పేర్లను జిల్లా సహకార అధికారి సెల్ నంబర్ 9100115688 లో సంప్రదించి పేర్లను నమోదు చేసుకొని, 14న రైల్వే స్టేషన్ సమీపంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తుగా జరిగే కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఖుర్షీద్ ఆ ప్రకటనలో కోరారు.

Share This Post