ఈ నెల 16వ తేది నుండి నిర్వహించే స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా

పత్రికా ప్రకటన తేదీ: 15-09-2021
వనపర్తి.

– వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:
– రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి:
– 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి:
– గ్రామాలలో ఇంటింటి సర్వే చేసి వ్యాక్సినేషన్
అయినట్లు స్టికర్ అంటించాలి:
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ( సెప్టెంబర్ 16) స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి అందరి సహకారంతో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమంపై వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉందని, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలోని వార్డుల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాలో సైతం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టాలని, దీని కోసం ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్, వాటి పరిధిలో ఉన్న గ్రామాలో వ్యాక్సిన్ చేయుటకు ప్రణాళికలు రుపొందించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో అవసరమైన మే ర వ్యాక్సిన్ అందుబాటులొ ఉన్నందున పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. గ్రామాలో ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ అందించాలని ఆయన ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసి, వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు డోర్లకు స్టికర్ లను అంటించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. కోవిడ్ నివారణ టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మొదటి కోటి డోసుల వ్యాక్సినేషన్ కు 178 రోజుల సమయం పట్టిందని, రెండవ కోటి వ్యాక్సిన్ డోసులు 71 రోజులలో పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మూడో కోటి వ్యాక్సినేషన్ డోసులను 20 రోజులోపు అందించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతుందని సీఎస్ వివరించారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలో ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేసెందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్, రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ 35 శాతం పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మిగిలిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో103 కోవిడ్ సెంటర్లు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డిప్యూటీ డి ఎం& హెచ్ ఓ. శ్రీనివాసులు, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డా. రవిశంకర్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి పి ఓ సురేష్, తరులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేది నుండి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఉదయం 7 గంటల నుండి వ్యాక్సినేషన్ ప్రారంభించి, త్వరగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆమె తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో ఉండే సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారంతో అవగాహన కల్పించి, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన వేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జడ్పీ సీఈవో, డి పి ఓ, మున్సిపల్ కమిషనర్, వ్యాక్సినేషన్ కు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు.
……………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post