ఈ నెల 16, 17వ తేదీలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆటల పోటీలు : జిల్లా క్రీడల శాఖ అధికారి అతిక్ ఉర్ రెహమాన్

పత్రికా ప్రకటన    తేది:11.08.2022, వనపర్తి.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16, 17వ తేదీలలో వనపర్తి కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడల శాఖ అధికారి అతిక్ ఉర్ రెహమాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీలలో పాల్గొనదలచిన వారు వాలి బాల్, కబడ్డీ, ఖో – ఖో, లాంగ్ జంప్, తగ్ ఆఫ్ ఫర్ క్రీడలలో ఆసక్తి గల ఉద్యోగులు తమ యొక్క పేర్లను జిల్లా యువజన, క్రీడల అధికారి, వనపర్తి కార్యాలయంలో ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా  నమోదు చేసుకోగలరని ఆయన సూచించారు.
……
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post