ఈ నెల 17 నుండి 20వ.తేదిలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,    తేది:13.12.2021, వనపర్తి.

ఈ నెల 17 నుండి 20 వ.తేది లోపు వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని, నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం, మార్కెట్ యార్డ్ కార్యాలయాలు, డబుల్ బెడ్ రూములు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి బస్సు మార్గాన వస్తున్న సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
కర్నే తాండ దగ్గర హెలిప్యాడ్ కు సిద్ధం చేయాలని, ఆర్ అండ్ బి శాఖ, ఇరిగేషన్ శాఖను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమానికి డి ఆర్ డి ఎ, డి ఎల్ పి ఓ శాఖలు పనులు నిర్వహించాలని ఆమె తెలిపారు. వీరాయపల్లి వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, చిట్యాలలో మార్కెట్ యార్డ్ వేరుశనగ రైతులను తరలించేలా చూడాలని, ఎ.ఎం.సి. మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేస్తారని, ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు హాజరయ్యే విధంగా వారికి సమాచారం అందించి ప్రోటోకాల్ పాటించాలని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చిట్యాలలోని డబల్ బెడ్ రూమ్ లను, మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. అలాగే సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ కార్యాలయాన్ని అందమైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. అలాగే కార్యాలయ ఆవరణలో సింగపూర్ చైర్, గన్నేరు తదితర చెట్లను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారి ఆదేశించారు. ఫౌంటెన్ పనిచేస్తుందా లేదా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నూతన కలెక్టర్ కార్యాలయంలో  పూజ నిర్వహిస్తున్న సందర్భంగా అందుకు సంబంధించిన పూజా సామాగ్రి, పురోహితుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ , (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్  డీఎంహెచ్వో చందు నాయక్, ఆర్ అండ్ బి ఈ ఈ  దేశ్యనాయక్, పి ఆర్ ఈఈ మల్లయ్య,  హార్టికల్చర్ అధికారి సురేష్ తాసిల్దార్ రాజేందర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార్లు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post