ఈ నెల 17 వ తేదీన ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, IT శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బండ మైసమ్మ నగర్ లో 27.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,  CC నగర్ లో 20.46 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 264 ఇండ్లను 17 వ తేదీన ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని తెలిపారు.  ఇండ్ల కేటాయింపు లో ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా లబ్ధిదారులతో రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి అర్హులను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్తించి అన్ని సౌకర్యాల తో తమ సొంత ఇంటిలో పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఆత్మగౌరవం తో బ్రతకాలనే సదుద్దేశంతో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో తప్ప దేశంలో ఎక్కడా ఈ కార్యక్రమం అమలు కావడం లేదని వివరించారు.

Share This Post