ఈ నెల 18వ తేదీ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు ధరఖాస్తులు స్వీకరణకు అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి 2021-23 సంవత్సరాలకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు లైసెన్సులు జారీ, 20వ తేదీన ఖమ్మవారి కళ్యాణమండపంలో డ్రా నిర్వహణకు ఏర్పాట్లు తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 88 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. 88 మద్యం దుకాణాలకు గాను 44 ఎస్టీలకు, 7 ఎస్సీలకు, గౌడకు 6 మద్యం దుకాణాలు రిజర్వు చేయడం జరిగిందని మిగిలిన 31 మద్యం దుకాణాలను జనరల్ కేటగిరీలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నెల 18వ తేదీ కార్యాలయపు పని వేళల వరకు మద్యం దుకాణాలు కేటాయింపునకు కొత్తగూడెంలోని ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 20వ తేదీన కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించే లాటరీ కార్యక్రమాన్ని వీడియో కవరేజి చేయుటకు ఏర్పాట్లు చేయాలని, రద్దీ నియంత్రణకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. లైసెన్సు కొరకు దరఖాస్తు చేసిన వ్యాపారులకు మాత్రమే డ్రా నిర్వహణకు అనుమతిచ్చేందుకు ఎంట్రీ పాసు జారీ చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసు ఉన్న వ్యక్తులను మాత్రమే హాలులోకి అనుమతించాలని చెప్పారు. దుకాణాల వారిగా వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. 2021-23 రెండు సంవత్సరాలకు మద్యం దుకాణాలు కేటాయింపుకు ఈ నెల 20వ తేదీన లాటరీ నిర్వహణ, మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి మండల వారిగా నివేదికలు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లు ప్రకారం ముద్యం దుకాణాలకు ధరఖాస్తులు తీసుకోవాలని ఎస్టీ, ఎస్సీ మరియు గౌడలకు రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలకు ఇతర కులాల వారికి కేటాయించడానికి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. లాటరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని, చెల్లిస్టు ప్రకారం నివేదికలు అందచేయాలని చెప్పారు. శనివారం వరకు 191 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. డాక్యుమెంట్లు పరిశీలన పకడ్బందీగా చేయాలని, డ్రా నిర్వహణకు స్టేషన్వారిగా బ్లాకులు ఏర్పాటు చేయాలని చెప్పారు. రద్దీ లేకుండా కార్యక్రమం సజావుగా, సక్రమంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ ఈఎస్ను ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు ఎటువంటి విమర్శలకు తావు లేకుండా డ్రా నిర్వహణకు సర్వం సన్నద్ధంగా ఉండాలని ఉండాలని చెప్పారు. డ్రా నిర్వహించు ప్రదేశంలో వ్యాపారులు కూర్చోవడానికి వీలుగా షామియానాలు, కుర్చీలు, మంచినీరు, పీఏ సిస్టం ఏర్పాటుతో పాటు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి సిద్ధం చేయాలని చెప్పారు. వచ్చిన ప్రతి దరఖాస్తును నిషితంగా పరిశీలన చేయాలని చెప్పారు.

 

ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post