ఈ నెల 19వ. తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్ల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ అపూర్వ రావు

పత్రికా ప్రకటన.   తేది:16.12.2021, వనపర్తి.

ఈ నెల 19 వ. తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్న వనపర్తి నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాలను గురువారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి, మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం అందమైన మొక్కలు, విద్యుత్ దీపాల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి, అన్ని విధాల ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పనులు పూర్తి చేయాలని  ఆయా శాఖల అధికారులకు ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ అపూర్వ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post