ఈ నెల 19వ. తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:15.12.2021.  వనపర్తి.

ఈ నెల 19 వ. తేదీన వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, హెలిప్యాడ్ దగ్గర పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
బుధవారం ఈ.ఎన్.సి. రఘుపతి రెడ్డితో కలిసి హెలిప్యాడ్ స్థలాన్ని, నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఆమె తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దాలని, లైటింగ్, స్టేజి, బారికేడ్లు, మొక్కలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశీష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, ఎస్ నరసింహ, ఈ ఈ దేశ్య నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి సురేష్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
……..
అనంతరం  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిట్యాల దగ్గర మార్కెట్ యార్డ్ ను, వీరాయపల్లిలోని వేరుశనగ పరిశోధనా కేంద్రం, కర్నె తాండ లిఫ్ట్ ఇరిగేషన్, పనులను ఆయన పరిశీలించారు.
మంత్రి వెంట మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్ పి.రవి కుమార్, జాయింట్ డైరెక్టర్ ఇఫ్తాఖర్ నాజీబ్,జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశీష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మారెడ్డి, డి ఎం ఓ స్వరణ్ సింగ్, సెక్రటరీ జి.లక్ష్మయ్య, ఎస్. ఈ. లక్ష్మణ్ గౌడ్, ఎస్.ఈ. నాగేశ్వరరావు, డి.ఎస్.పి కిరణ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post