పత్రికా ప్రకటన
19 .11 .2021
వనపర్తి
మద్యం దుకాణాల టెండర్లు లాటరీ పద్ధతి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ లాటరీ ద్వారా కేటాయింపు కొరకు ఈ నెల 20 న వనపర్తి పట్టణంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.