ఈ నెల 20లోగా బృహత్ పల్లె ప్రకృతి వనం లక్ష్యాలను పూర్తి చేయాలి– జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం

ఈ నెల 20లోగా బృహత్ పల్లె ప్రకృతి వనం లక్ష్యాలను పూర్తి చేయాలి– జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, సెప్టెంబర్-04:

శనివారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.

బృహత్ పల్లె ప్రకృతి వనం లక్ష్యాలను సాధించటానికి ప్రతి రోజూ లక్ష్యానికి తగ్గట్టు మొక్కలు నాటి సెప్టెంబర్ 20 లోగా లక్ష్యం పూర్తిచేయాలని తెలిపారు.  కేవలం పేపర్ పై లక్ష్యం సాధించినట్లు చూపి వాస్తవంగా లేకుంటే సంభందిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రిపోర్టు లలో చూపిన విధంగా ప్రగతి వాస్తవంగా కనిపించాలని తెలిపారు.  

హరితహారం లో నాటిన మొక్కలకు సంభందించిన పేమెంట్ ను వెంట వెంటనే చెల్లించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల కు తప్పనిసరిగా వాచర్లను ఎర్పాటు చేసుకోవాలని తెలిపారు. వాచర్ల ఏర్పాటుతో మొక్కలను కాపాడుకోవచ్చని తెలిపారు. 

గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు, టాంకర్ లు వ్యక్తిగత పనులకు వాడకుండా GPS రిపోర్టు ను పరిశీలించాలని, వ్యక్తిగత పనులకు వాడినట్లు తేలితే సంబంధితులపై చర్యలు తీసుకోవాలని,  ఉదయం 9 గంటలలో గా వాహనాలను సంభందిత పనులకు వెల్లేవిధంగా పర్యవేక్షించాలని అన్నారు. రోజువారీగా ఏ ఏ పనులకు వాహనాలను వాడుతున్నారో రోజువారీగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన లాగ్ బుక్ లు నిర్వహించేలా చూడాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణా కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ సి. ఇ.ఓ., డి.ఆర్. డి.ఓ. సన్యాసయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post