ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి ….

ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి ….

ప్రచురణార్థం

ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి ….

మహబూబాబాద్, మే – 12:

మే 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలోని ఎంపీడీఓ లు, సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం, హరిత హారం, దళిత బంధు, ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. పై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మే 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమాలు నిర్వహించి పారిశుద్ధ్యం, మౌళిక వసతుల కల్పన, హరిత హారం, బృహత పల్లె ప్రకృతి వనాలు, గ్రామస్తులు భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

వైకుంఠ దామాలు, సిగ్రిగేషన్ షెడ్ లను పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొని రావాలని, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించి నీటి లభ్యత అందే విధంగా చూడాలని తెలిపారు

గత 4 విడతల్లో ప్రగతి సాధించిన వివరాలను annexure 2 లో క్యాప్చర్ చేయాలని తెలిపారు. మండలంలో నాలుగు రోజుల్లోగా మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోటు పాట్లను సవరించుకోవాలన్నారు. మంగళవారం లోగా జిల్లా స్థాయి సన్నాహక సమావేశం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించాలని తెలిపారు.

ఆక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, మొక్కలు నాటేందుకు సరియైన ప్రాంతాలను గుర్తించాలని, గతంలో ఎలా చేశారు, ఎక్కడ బాగా చేశారు, ఎక్కడ చేయలేక పోయినం పరిశీలించుకోవాలి అని తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి స్పెషల్ అధికారిగా ఉంటారని, పోలీస్, మెడికల్ అధికారులు మినహా అందరూ అధికారులు 15 రోజుల పాటు కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

పని జరిగి మెజర్ చేయకుండా బిల్ ప్రాసెస్ చేయని సందర్భంలో అధికారుల తప్పిదగా
భావిస్తాం అని అందుకు వారే బాధ్యులని, చెల్లింపుల వివరాలను పరిశీలించుకోవాలి అని తెలిపారు. ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామ స్థాయి కమిటీని చేయాలని,ఆక్షన్ ప్లాన్ తయారు చేసి మండల స్థాయిలో చేపట్టనున్న పనుల షెడ్యూల్ వివరాలను అందించాలని తెలిపారు. పాత బావులు వాడని సందర్భంలో వాటిని పూడ్చలని, అలాగే మిషన్ భగీరథ పై దృష్టి పెట్టాలని తెలిపారు. ట్రాక్టర్, ట్రైలర్ లు, టాంకర్ లేకుండా వున్న వారి వివరాలను సమర్పించాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ ల సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

హరిత హారం ప్రతి మండలం లో జరిగే విధంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను వెంటనే గుర్తించాలని, ప్రతి ఇంటికీ మొక్కలు అందించే విధంగా, బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ కొరకు మొక్కలను సిద్దం చేయాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ దళిత బంధు పై సమీక్షించారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలో పెండింగ్ లో లేకుండా చూడాలని తెలిపారు. ఎన్.ఆర్. ఈ.జి.ఎస్ లో లేబర్ ఇంప్రూవ్మెంట్ చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది ఉపాధి హామీ పనులకు వచ్చేటట్లు అధికారులు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.అర్.డి. ఓ. సన్యసయ్య, డి.పి. ఓ. సాయిబాబా, అదనపు డి.ఆర్.డి. ఓ., డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, జిల్లాలోని ఎంపీడీఓ లు, ప్రత్యేక అధికారులు డాక్టర్ టి.సుధాకర్, ఈ.డి.
ఎస్.ఈ. కార్పొరేషన్ బాల రాజు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post