ఈ నెల 20 బుధవారం నుండి జిల్లాలో  మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే వారి పై 1000 రూపాయల ఫైన్ విధించి మూడో దశ కరోనా వైరస్ బారినపడకుండా జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్థం *.                                                             జయశంకర్ భూపాలపల్లి జనవరి 18 (మంగళవారం).                                                  ఈ నెల 20 బుధవారం నుండి జిల్లాలో  మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే వారి పై 1000 రూపాయల ఫైన్ విధించి మూడో దశ కరోనా వైరస్ బారినపడకుండా జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో మూడో వేవ్ కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడిలో మొదటి మరియు రెండు విడతల్లో వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా అధికార యంత్రాంగం చూపిన ఉత్సాహాన్ని మూడో దశలో కూడా చూపి జిల్లాలోని ప్రజలను అప్రమత్తం  చేయాలని అన్నారు. జిల్లాలో మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ 100% మరియు రెండో డోస్ 76 % వేయడం జరిగిందని అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు వేసుకోనేల చూడాలని అన్నారు.గుంపులు గుంపులుగా జమ కాకుండా చూడాలని అన్నారు. మాస్క్  లేకుండా పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే వారిపై 1000 రూపాయల ఫైన్ వెయ్యాలని ఫోన్ ద్వారా పోలీస్ అధికారులను ఆదేశించారు.   అలాగే జ్వరము, దగ్గు, జలుబు లాంటి వ్యాధి లక్షణాలతో బాధపడితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనలు, సలహాల మేరకు మందులను వాడి 7 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ప్రజలకు  సూచించారు. అన్ని పీహెచ్ సిలలో ఆక్సిజన్ కాన్ సంట్రెటర్ ను బెడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని 15 నుండి 17 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని గుర్తించి వ్యాక్సిన్ అందించాలన్నారు.  వ్యాక్సినేషన్ కార్యక్రమం బిజీ తగ్గినందున సాధారణ మరియు ప్రసూతి వైద్య సేవలపై వైద్యశాఖ దృష్టి సారించాలని, పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు సరైన వైద్య సేవలందించాలని అన్నారు. అన్ని పీహెచ్సీలలో పాము కాటుతో పాటు అన్ని రకాల అత్యవసర మందులను  అందుబాటులో ఉంచాలని, ప్రతి ఆస్పత్రిలో వైద్యుల వివరాలను తెలుపుతూ సిటిజన్ ఛార్టర్  ను ప్రదర్శించాలని, వెనుకబడిన జిల్లా అయిన కూడా జిల్లాలో వైద్య సేవలలో జిల్లా ముందు నిలిచేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందరూ అంకితభావంతో పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీ రామ్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ కొమురయ్య, డి సి హెచ్ ఎస్ డాక్టర్ తిరుపతి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ జైపాల్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ భాష్య నాయక్ ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.                                                                డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post