సెప్టెంబర్ 13, 2021 – ఆదిలాబాదు:-
ఈ నెల 23 న జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ను నిర్వహించనున్నట్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.గణపతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 23 గురువారం రోజున ఉదయం గం.10:30 ని. లకు ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి సమావేశానికి గౌరవ సభ్యులు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆ ప్రకటనలో తెలిపారు. సర్వ సభ్య సమావేశంలో శాఖల వారీగా చర్చించే నిమిత్తం ప్రగతి నివేదికలను ఈ నెల 17 లోగా తన కార్యాలయానికి పంపించాలని జిల్లా అధికారులను కోరారు.
…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.