ఈ నెల 23, 24, 25 వ. తేదీలలో పల్స్ పోలియో, టీఎన్జీవో భవన్ లో పల్స్ పోలియో ఓరియంటెడ్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.    తేది:07.01.2022, వనపర్తి.

ఈ నెల 23, 24, 25 వ. తేదీలలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారులకు, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
శుక్రవారం వనపర్తి పట్టణంలోని టీఎన్జీవో భవన్లో పల్స్ పోలియో ఓరియంటెడ్ వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 వ. తేదీలలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0-5 సం.ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలని వైద్య అధికారులకు, సిబ్బందికి ఆయన ఆదేశించారు.
జిల్లాలో 0-5 సం.ల పిల్లలు 53 వేల 4 వందల 37 మంది ఉన్నారని, మొత్తం 4 వందల పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో కేంద్రానికి నలుగురు చొప్పున 16 వందల మంది కార్యకర్తలు పోలియో చుక్కలు అందించుటకు పని చేస్తారని ఆయన వివరించారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ మాట్లాడుతూ 23వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద పోలియో చుక్కలు వేస్తారని, 24, 25వ తేదీన ఇంటింటికి తిరిగి వైద్య, ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు అందిస్తారని ఆయన తెలిపారు. స్లమ్ ఏరియాలో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాంతాలలో, చేపలు పట్టే స్థలాలు,  గుడిసెల దగ్గర ఉండే చిన్నపిల్లలను గుర్తించి, పోలియో చుక్కలు అందించాలని ఆయన సూచించారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ స్కాలర్స్ కళాశాల వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా కరోనా నుండి రక్షణ పొందాలని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా.శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి డా. రవిశంకర్, డి ఐ ఓ డా. రామ్ చందర్, ఎస్ ఎన్ ఓ సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ డా. ఎండి ఆజాద్, పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. శంకర్, డా. మంజు, డాక్టర్ వంశీ, సూపర్వైజర్లు నర్యా, బుగ్గప్ప, మద్దిలేటి, చంద్రయ్య, సాయి రెడ్డి, వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post