ఈ నెల 25న నిర్వహించనున్నCET- పరీక్షపై సమన్వయ కమిటీ సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన                                      తేది:22.7.2021.
వనపర్తి.

కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET) పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి .వేణుగోపాల్ సంబంధిత అధికారులను కోరారు.
గురువారం ఆయన తన చాంబర్లో బి.సి. రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రవేశాల కొరకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET-Entrance) పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
11 కేంద్రాలను పర్యవేక్షించుటకు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ (అబ్జర్వర్) పర్యవేక్షణాధికారిగా వుంటారు. ప్రతి సెంటర్ కు ఒక కానిస్టేబుల్ ని ఏర్పాటు చేయాలని అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ని కోరారు. అదేవిధంగా పరీక్షలలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని బిసి రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. 11 కేంద్రాలలో ఒక్కొక్క సెంటర్ లో ఒక ఆశా వర్కర్ ని ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచాలని, డి ఎం హెచ్ ఓ చందు నాయక్ కి సూచించారు. ప్రతి విద్యార్థి శానిటైజ్ చేసుకొని, మాస్క్ తప్పని సరిగా ధరించే లా చూడాలని డి ఈ ఓ రవీందర్ కు ఆదేశించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్ష సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.

ఈ సమావేశంలో బిసి రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఈవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మధుకర్, డి ఎం హెచ్ వో చందు నాయక్, ఎమ్మార్వో రాజేందర్, సంబంధిత జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

____
జిల్లా పౌరసంబంధాలఅధికారి వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post