పత్రికా ప్రకటన. తేది:21.10.2021, వనపర్తి.
ఈ నెల 25వ. తేది నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ పరిక్షలు సజావుగా నిర్వహించేలా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్య శాఖ మంత్రి అన్ని జిల్లాల కల్లెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కారణంగా పరిక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి పరిక్షలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని ఆమె తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని, జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరిక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా, అన్ని సౌకర్యాలు కల్పించాలని, పకడ్బందిగా చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
ప్రతి సెంటర్ లో ఒక ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేయాలనీ, విధ్యార్థులు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కోవిడ్ నియమాలను పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ, నిరంతర విద్యుత్ సరపరా ఉండేలా చూసుకోవాలని, ప్రతి సెంటర్ లో సి.సి. కెమెరా లు ఏర్పాటు చేయాలనీ , ఉన్న సి.సి.కెమెరా లు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని అధికారులకు ఆమె ఆదేశించారు. పరీక్షలకు ముందే పరీక్ష కేంద్రాలను సానిటైజ్ చేయించాలని, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఫర్నిచర్ ను ఏర్పాటు చేసి సానిటైజ్ చేయాలనీ ఆమె అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులు పరిక్షలు రాసే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. విద్యార్థులు పరీక్షకు గంట ముందే సెంటర్ కు వచ్చేలా చూడాలని, తల్లితండ్రులు కరోనా గురించి భయపడకుండా పిల్లలను పరీక్షలకు పంపేలా వారికి అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలనీ, పోలీస్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖ అధికారులు పరిక్షల సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంసిద్దంగా ఉండాలని ఆమె సూచించారు.
జిల్లా కలక్టర్ షేక్ యాస్మీన్ భాష మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కు ధరించి, శానిటైజర్ చేసుకోని, భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని, కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించిన విద్యార్థులు పరీక్ష వ్రాయుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వుండేలా, 144 సెక్షన్ అమలు అయ్యేలా. పోలీసు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టి ఎస్ ఆర్ టి సి, పోస్టల్ శాఖల వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, డి ఐ ఈ ఓ ప్రకాశం శెట్టి, జాకీర్, విద్యుత్ శాఖ, పోస్ట్ ఆఫీస్, రెవెన్యూ సిబ్బంది జె.వెంకటేశ్వర్ రావు, సి ఐ సిసిఎస్, డి ఈ నరేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి గారి చే జారీ చేయడమైనది.