ఈ నెల 25వ. తేది నుండి నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలపై సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.       తేది:23.09.2022, వనపర్తి.

దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 25వ. తేది నుండి నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగను పురస్కరించుకొని ఈ నెల 25వ. తేది నుండి అక్టోబర్ 3వ. తేది వరకు బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఆయా శాఖల అధికారులకు విధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఆర్ డి ఓ, తహసిల్దార్ లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలలో పాల్గొనాలని, డి పి ఆర్ ఓ. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సౌండ్ సిస్టం, యాంకర్లను ఏర్పాటు చేయటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం, ఆర్ అండ్ బి. నల్ల చెరువు వద్ద డయాస్, బారికేడ్లు ఏర్పాటు చేయడం, విద్యుత్ శాఖ డి ఈ ఈ. బతుకమ్మ ఉత్సవాలు పూర్తయ్యేవరకు నిరంతర విద్యుత్ అందించటం, డి ఈ ఓ. ప్రభుత్వ పాఠశాలలు, కేజీ బి వి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో సాంస్కృతిక కార్యక్రమాలు, హై లైటింగ్ ఏర్పాటు చేయాలని, మున్సిపల్ కమిషనర్ నల్ల చెరువు వద్ద పారిశుద్ధ్య పనులను నిర్వర్తించుట, డి ఆర్ డి ఓ. మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో 25వ తేదీన బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, డయాస్ ను పూలతో అలంకరించుట, అగ్నిమాపక శాఖ ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో వాటరింగ్ చేయుట, పౌర సరఫరాల శాఖ వీఐపీలకు టి, టిఫిన్లు ఏర్పాటు చేయుట, డి ఎం హెచ్ ఓ. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో అక్టోబర్ 2వ తేదీన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుట, డి డబ్ల్యు ఓ. గ్రామ, మండల స్థాయిలో, 29వ తేదీన ఐ డి ఓ సి.లో అంగన్వాడి కార్యకర్తలతో ఉత్సవాలు నిర్వహించుట, అటవీశాఖ ఉత్సవాల ఆవరణలో హరితహారం మొక్కలను ఏర్పాటు చేయుట, చేనేత ఏడి టేస్కో స్టాల్స్ను ఏర్పాటు చేయుట, ప్రత్యేక అధికారులు గ్రామ, మండల స్థాయిలో బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన వివరించారు.
అక్టోబర్ 5వ తేదీన దసరా ఉత్సవంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు వివిధ అలంకరణలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని ఆయన తెలిపారు. 25వ తేదీన ఎంగిలి పువ్వు బతుకమ్మ- డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో, 26వ తేదీన అటుకుల బతుకమ్మ- డి ఈ ఓ, 27వ తేదీన ముద్ద పువ్వు బతుకమ్మ- డీఏవో, 28వ తేదీన నాన బియ్యం బతుకమ్మ- డి సి ఎస్ ఒ, డి ఎం, 29వ తేదీన అట్ల బతుకమ్మ: డి డబ్ల్యూ ఓ, 30వ తేదీన అలిగిన బతుకమ్మ, అక్టోబర్ ఒకటవ తేదీన వేపకాయల బతుకమ్మ: డి పి ఓ, రెండవ తేదీన వెన్నముద్దల బతుకమ్మ- డీఎంహెచ్వో, మూడవ తేదీన సద్దుల బతుకమ్మ- మున్సిపాలిటీ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు. బతుకమ్మ ఉత్సవాల్లో అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post