ఈ నెల 25 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్

పత్రికా ప్రకటన తేది:23.10.2021, వనపర్తి.

ఈ నెల 25 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్ ఆదేశించారు.
శనివారం వనపర్తి జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆయన తగు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలలో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఉండేటట్లు చూడాలని, శానిటైజర్ చేయించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, కోవిడ్ టికలను ఉదృతంగా వాక్సినేషన్ చేయాలని, సంబంధిత అధికారులకు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లకు ఆయన ఆదేశించారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి. ఐ. ఈ. వో. ప్రకాశం శెట్టి, జాకైర్, రాజేందర్ గౌడ్ తహసీల్దార్ ఈ.డి.ఎం. వినోద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post