ఈ నెల 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

నల్గొండ,ఆక్టోబర్ 18.    ఈనెల 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
    సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో  అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను సాఫీ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈనెల 25 నుండి నవంబర్ 3వరకు  ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లాలో  58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.జిల్లాలోని 119 ప్రభుత్వ,ఎయిడెడ్,మోడల్,గురుకుల,కస్తూర్బా  కళాశాలల నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు  16854 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించడం జరగదని ఆయన సూచించారు.  పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపర్చడం జరుగుతుందని తెలిపారు.  పరీక్ష కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లు,4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు  ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.  ప్రతి సెంటర్ వద్ద వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు,పరీక్ష కేంద్రాలకు పరీక్షల సమయం లో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కోరారు.  పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండ, విద్యార్థిని,విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా సకాలంలో బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు త్రాగు నీటి సదుపాయం కల్పించాలని సూచించారు.అన్ని పరీక్షా కేంద్రాల వద్ద  పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ను కోరారు.అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్.హెచ్.ఓ.లకు  ఈ నెల 21 నుండి పరీక్షా పేపర్ లు కలిగిన సీల్డ్ ట్రంక్ పెట్టెలు భద్ర పరచటకు పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయాలని అన్నారు
    ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి ఆర్.దస్రు నాయక్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్స్ వి.భాను నాయక్,కె.నరేంద్ర కుమార్,లెక్చరర్ ఎం.డి. ఇస్మాయిల్,హై పవర్ కమిటీ సభ్యులు జూనియర్ కళాశాల ల  లెక్చరర్  సింగం శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post