ఈ నెల 25 నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు

  ఈ నెల 25 నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహణకు  తెలంగాణ మైనార్టీ  గురుకుల బాలికల జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు.పరీక్షా కేంద్రం లో సి.సి.కెమెరాలు,కోవిడ్ నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లు ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం దేవరకొండ రోడ్డు లోని సంక్షేమ.పోస్ట్ మెట్రిక్ విద్యార్థినుల సంక్షేమ వసతి గృహం,బి.సి.కళాశాల బాలికల వసతి గృహం ఏ లను ఆయన తనిఖీ చేశారు.కోవిడ్ కారణం గా మూసి వేసిన వసతి గృహాలను ప్రభుత్వ ఆదేశాల ననుసరించి తిరిగి  ప్రారంభించారు.వసతి గృహం లలో పారిశుధ్య పరిస్థితులు ఆయన పరిశీలించారు.మున్సిపల్ సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ వసతి గృహాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచేలా,కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.అనంతరం కనగల్ మండల కేంద్రం లో కె.జి.బి.వి బాలికల వసతి గృహం,ఆదర్శ  పాఠశాల లను తనిఖీ చేసి విద్యార్థిని లు,ఉపాధ్యాయుల తో మాట్లాడారు.పారిశుధ్యం,పరిశుభ్రత కు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్,సాంఘిక సంక్షేమ శాఖ డి.డి.సల్మా భాను, జిల్లా బి.సి.అభివృద్ధి అధికారి కృష్ణ వేణి,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్,జిల్లా ఎగ్జామి నేషన్ కమిటీ సభ్యులు ఎం.డి. ఇస్మాయిల్, జిల్లా విద్యా శాఖ అధికారి భిక్ష పతి తదితరులు పాల్గొన్నారు

Share This Post